ఎంగిడి ఆరోగ్యం నిలకడగా ఉంది: ఐపీఎల్ నిర్వాహకుల అప్ డేట్

  • ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగిడికి గాయం
  • క్యాచ్ పట్టే ప్రయత్నంలో తల నేలకు బలంగా తాకిన వైనం
  • ఆసుపత్రికి తరలింపు.. ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
  • ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విప్రాజ్ నిగమ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ తలకు గాయం కావడంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మైదానంలో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే, ఎంగిడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఓ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో ఎంగిడి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి తల నేలకు బలంగా తగిలింది. వెంటనే తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పిగా ఉందని చెప్పడంతో, జట్టు ఫిజియోలు ప్రాథమిక చికిత్స అందించారు. ముందు జాగ్రత్త చర్యగా అతడిని అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఎంగిడి ఆరోగ్యం నిలకడగా ఉందని, కాసేపట్లో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారని ఐపీఎల్ నిర్వాహకులు తమ ప్రకటనలో తెలిపారు. ఈ అప్‌డేట్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఎంగిడి స్థానంలో విప్రజ్ నిగమ్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి తీసుకున్నారు.

Lungi Ngidi
Lungi Ngidi injury
Delhi Capitals
IPL 2024
Punjab Kings
Cricket injury
Vipraj Nigam
Concussion substitute

More Telugu News